అంతర పంటలు :

పసుపులో మొక్కజోన్న, ఆముదం  సాగు లాభంగా వుంటుంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రెండు వరుసల పసుపు, ఒక వరుస మొక్కజోన్న వేస్తారు. అదే విధంగా ఆముదoను అంతర పంటగా 10- 12 పసుపు సాళ్ళకు  ఒక వరుస చొప్పున నాటవచ్చు. మొక్కజోన్న(లేదా) ఆముదంపంటలను అంతర పంటలుగా వేసినపుడు రెండు పంటలకు సిఫారుసు  చేసిన ఎరువులు చేయాలి. పసుపును కొబ్బరి, మామిడిలో అంతరం పంటగా సాగుచేయవచ్చు. పసుపును మామిడిలో అంతరాపంటగా పెంచుటకు 60x 20  సెII మీII  దూరంలో నాటిన యెడల అధిక దిగుబడులను పొందవచ్చు. పి.టి.యస్-43 , సుగుణ, ఎ.సి.సి.- 360  అనురకాలు  అంతర పంటలుగా అనుకూలమైనవి